మేం గెలిచే స్థానాలు ఏడు.. కాంగ్రెస్‌కు ఆ ఒక్కటే - కేటీఆర్‌ చిట్‌చాట్‌

కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి సాయం చేసిందన్నారు కేటీఆర్. మల్కాజ్‌గిరికి సునీతా మహేందర్ రెడ్డికి సంబంధం ఏంటన్నారు.

Advertisement
Update:2024-05-15 21:07 IST

తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగిందన్నారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. సైలెంట్ ఓటింగ్‌ బీఆర్ఎస్‌కు మేలు చేస్తుందన్నారు.

కాంగ్రెస్‌ నల్గొండ సీటు మాత్రమే గెలుచుకుంటుందన్నారు కేటీఆర్. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు సరిగ్గా లేరన్నారు. నాగర్‌కర్నూలు, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్‌, చేవెళ్లలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. పెద్దపల్లి, ఆదిలాబాద్‌, నిజామాబాద్ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉందన్నారు.

కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి సాయం చేసిందన్నారు కేటీఆర్. మల్కాజ్‌గిరికి సునీతా మహేందర్ రెడ్డికి సంబంధం ఏంటన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌ని గెలిపించేందుకు అడ్రస్‌ లేని వెలిచాల రాజేందర్‌ రావుకు టికెట్ ఇచ్చారన్నారు. ఇక నాగర్‌కర్నూలులో బీఆర్ఎస్ అభ్యర్థి RS ప్రవీణ్‌కుమార్‌తో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల అభ్యర్థులు సరితూగలేరన్నారు కేటీఆర్. RSPని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సమీకరణాలు మారాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపిందని అనుకోవట్లేదన్నారు. ఏపీలో జగనే గెలుస్తాడని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News