లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పకుండా మంచి సంఖ్యలో సీట్లు గెలుస్తుంది : మంత్రి కేటీఆర్

2024లో కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకంగా మారుతుందని కేటీఆర్ చెప్పారు.

Advertisement
Update:2023-06-26 07:29 IST

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తం చేయడానికి నిర్ణయించుకున్నారు. వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుంది. తెలంగాణలో మేము చేయగలిగినంత అభివృద్ధి చేశాము. ఇప్పుడు జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకొని.. ముందుకు వెళ్తున్నాము. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 272 మ్యాజిక్ ఫిగర్ సీట్లు సాధిస్తుందా.. అంటే నేను కాదనే చెప్తాను. కానీ కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మంచి సంఖ్యలో సీట్లు గెలుచుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన పీటీఐ వార్త సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలను పంచుకున్నారు.

2024లో కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకంగా మారుతుందని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే మహారాష్ట్రలో పార్టీ విస్తరణ వేగంగా జరుగుతోంది. అక్కడ నిర్వహించిన నాలుగు సభలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. త్వరలో జరగనున్న జడ్పీ ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చెప్పారు.

దేశానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. నేటికీ కోట్ల మందికి తినడానికి తిండి, కట్టుకోడానికి బట్టలు లేవు. ప్రపంచంలో అనేక దేశాలకు మన తర్వాత స్వాతంత్రం వచ్చింది. బాంబు దాడులు జరిగిన దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశాలు అన్ని రంగాల్లో మన కన్నా ఎక్కువగా అభివృద్ధి చెందాయని కేటీఆర్ చెప్పారు. దేశంలో నిరుద్యోగం వెంటాడుతోంది. రోడ్లు, తాగునీరు, కరెంట్ లేవు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటికి బాధ్యత వహించాల్సింది వంద శాతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే. ఆ రెండు పార్టీలకు ప్రజలే ప్రతిపక్షంగా మారారని కేటీఆర్ చెప్పారు.

తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టాము కదా.. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని చాలా మంది అంటుంన్నారు. మేము ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకున్నాము. ప్రజల్లో వ్యతిరేకత కాదు.. ఎంతో సానుకూలతు ఉన్నదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో 32 జిల్లా పరిషత్‌లకు గాను 32లో బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 136 బీఆర్ఎస్‌వే. అత్యధిక గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. ప్రజల మద్దతు, ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది కేటీఆర్ చెప్పారు. ఈ సారి 119 అసెంబ్లీలకు గాను 90 నుంచి 100 సీట్లు గెలుస్తాము. గత ఎన్నికల్లో 88 గెలిచాం. ఈ సారి అంతకు మించిన సీట్లు వస్తాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

దేశమంతా తెలంగాణ మోడల్ కోసం ఎదురు చూస్తోంది. అందరినీ కలుపుకొని వెళ్లడం.. సంపూర్ణంగా, సమగ్రంగా, సమతుల్యమైన అభివృద్ధి సాధించడమే తెలంగాణ మోడల్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తెలంగాణ జనాభా 3 శాతం కంటే తక్కువ. కానీ, జాతీయ స్థాయిలో పంచాయతీలు, మున్సిపాలిటీలు, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులన్నీ తెలంగాణకే క్యూ కడుతున్నాయని మంత్రి చెప్పారు. మొత్తం అవార్డుల్లో 30 శాతం తెలంగాణకు వచ్చాయి. తెలంగాణలో రూరల్, అర్బన్ డెవలప్‌మెంట్‌ను బ్యాలెన్స్ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణకు సుమారు 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకొని వచ్చాము. ప్రత్యక్షంగా 2.3 మిలియన్ ఉద్యోగాలు వచ్చాయి. 23 వేల కంటే ఎక్కవ అనుమతులు ఇచ్చాము. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉన్నాము. తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్‌గా నిలిచామని కేటీఆర్ చెప్పారు.  

Tags:    
Advertisement

Similar News