నీట్ లీకేజీపై బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదు?

విద్యార్థుల భవిష్యత్‌పై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌. నీట్‌ లీకేజీపై కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

Advertisement
Update: 2024-06-18 07:40 GMT

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాజ్‌భవన్‌ను ముట్టడించింది. నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

విద్యార్థుల భవిష్యత్‌పై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌. నీట్‌ లీకేజీపై కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే నీట్‌ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదే ఇష్యూపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. NEET పరీక్షకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలను ప్రభావితం చేసే సున్నితమైన అంశంపై NDA ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. వెంటనే పరిష్కరించాల్సిన ఇంత పెద్ద సమస్యను విద్యాశాఖ మంత్రి కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

Tags:    
Advertisement

Similar News