అమన్‌గల్‌లో నేడు బీఆర్‌ఎస్‌ రైతు ధర్నా

పాల్గొననున్న కేటీఆర్‌, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు

Advertisement
Update:2025-02-18 09:25 IST

రైతులకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలుకోసం రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌లో నేడు బీఆర్‌ఎస్‌ రైతు ధర్నా చేపట్టనున్నది. ఇప్పటికే వివిధ చోట్ల దీక్ష చేపట్టిన బీఆర్‌ఎస్‌ కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ధర్నా తలపెట్టింది. పోలీసులు ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నది. మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు నేతలు ఈ ధర్నాకు హాజరుకానున్నారు. 

Tags:    
Advertisement

Similar News