2028లో వచ్చేది మేమే...వారికి కేటీఆర్ వార్నింగ్!
ఆప్షన్‌లో అదానీకి కేంద్రం అప్పగించిందన్నారు కేటీఆర్. సొంత గనిలేకపోవడం వల్ల నష్టాల్లోకి వెళ్లిన విశాఖ స్టీల్‌ను అమ్మేందుకు ప్రయత్నించారన్నారు. ఇప్పడు సింగరేణి విషయంలోనూ అదే రకమైన కుట్ర జరుగుతోందన్నారు.
బొగ్గు గనుల వేలంపై తెలంగాణ పొలిటికల్ రచ్చ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే అంశంపై తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా..కుట్ర జరుగుతోందన్నారు. పీసీసీ చీఫ్ హోదాలో బొగ్గు గనుల వేలం వద్దని గతంలో ప్రధాని మోదీకి లేఖ రాసిన రేవంత్ రెడ్డి..ఇప్పుడు స్వయంగా వేలంలో పాల్గొనాలని నిర్ణయించడం దురదృష్టకరమన్నారు కేటీఆర్. బీఆర్ఎస్‌కు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని కేసీఆర్ చెప్తే రేవంత్ ఎద్దేవా చేశారని.. ఏపీలో 16 ఎంపీ స్థానాలు వచ్చిన టీడీపీ కేంద్రంలో కీలకంగా మారిందన్నారు.
ఒడిశాలో రెండు గనులను వేలం లేకుండా నైవేలి లిగ్నైట్‌కు అప్పగించారని గుర్తు చేశారు కేటీఆర్. గుజరాత్‌లోనూ రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు 2015లో వేలం లేకుండానే నేరుగా నాలుగు గనులు కేటాయించారన్నారు. తమిళనాడులోనూ బొగ్గు గనులను వేలం నుంచి మినహాయించాలని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై గతంలో కేంద్రాన్ని కోరారన్నారు కేటీఆర్. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం వల్లే నష్టాల్లోకి వెళ్లిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్ల మైన్‌ను క్యాప్టివ్ మైన్ కింద కేటాయించాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోరినా కేంద్రం ఇవ్వలేదన్నారు.
ఆప్షన్‌లో అదానీకి కేంద్రం అప్పగించిందన్నారు కేటీఆర్. సొంత గనిలేకపోవడం వల్ల నష్టాల్లోకి వెళ్లిన విశాఖ స్టీల్‌ను అమ్మేందుకు ప్రయత్నించారన్నారు. ఇప్పడు సింగరేణి విషయంలోనూ అదే రకమైన కుట్ర జరుగుతోందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ ప్రయోజనాలను రెండు జాతీయ పార్టీలను విస్మరించాయన్నారు కేటీఆర్. గత పదేళ్లు బీజేపీతో పోరాడామన్న కేటీఆర్..రాబోయే కాలంలోనూ పోరాటం కొనసాగిస్తామన్నారు. వేలంలో పాల్గొనవద్దని సంస్థలకు సూచించారు కేటీఆర్. నాలుగేళ్ల తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని..ఈ వేలంను క్యాన్సిల్ చేస్తామన్నారు కేటీఆర్.