కంటోన్మెంట్ బీఆర్ఎస్‌ అభ్యర్థిగా నివేదిత

ఇవాళ నియోజకవర్గ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత నివేదిత అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసినట్లు సమాచారం.

Advertisement
Update:2024-04-07 21:19 IST

కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత సాయన్న చిన్నకూతురు నివేదితను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ నియోజకవర్గ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత నివేదిత అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే రెండు, మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

సాయన్న మరణంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానం నుంచి ఆయన మరో కుమార్తె లాస్య నందిత పోటీ చేసి గెలిచారు. అయితే దురదృష్టవశాత్తు ఫిబ్రవరి 23న హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.

ఇక ఉద్యమకారుడు, పార్టీ సీనియర్ నేత గజ్జెల నగేశ్‌, క్రిషాంక్ పేర్లు వినిపించినప్పటికీ..చివరకు నివేదిత వైపే కేసీఆర్ మొగ్గు చూపారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇటీవల పార్టీలో చేరిన శ్రీ గణేష్‌ను అభ్యర్థిగా ఫైనల్ చేసింది కాంగ్రెస్‌. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీ గణేష్‌ 41 వేల ఓట్లు సాధించారు. ఇక బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టింది.

Tags:    
Advertisement

Similar News