బీఆర్ఎస్‌కు కేశవరావు గుడ్‌బై.. కాంగ్రెస్‌లో చేరికకు డేట్ ఫిక్స్.!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2013లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కేశవరావు ఆ పార్టీ తరపున వరుసగా రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు త్వరలోనే బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈనెల 30న కేశవరావు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. కేశవరావు కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి సైతం అదే రోజు కాంగ్రెస్‌లో చేరనున్నారని తెలుస్తోంది.
ఈనెల 22న కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ స్వయంగా కేశవరావు నివాసానికి వెళ్లారు. కేశవరావుతో పాటు ఆయన కూతురు, మేయర్ విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీపాదాస్ మున్షీ ఆహ్వానంతో.. తండ్రి, కూతురు ఇద్దరూ బీఆర్ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌కు కేశవరావు చెప్పారని సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2013లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కేశవరావు ఆ పార్టీ తరపున వరుసగా రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేశవరావుకు రాజ్యసభ ఎంపీగా మరో రెండేళ్లకుపైగా పదవీకాలం ఉంది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగానూ వ్యవహరించారు. ఇక 2014లో కె.కే కూతురు విజయలక్ష్మి బీఆర్ఎస్‌లో చేరారు. వరుసగా రెండు సార్లు ఆ పార్టీ తరపున GHMC కార్పొరేటర్‌గా గెలిచారు. ప్రస్తుతం విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్‌గా ఉన్నారు.