రేవంత్ రాజీనామా చేయ్‌.. సీఎంగా నేను చేసి చూపిస్తా

సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌పై స్పందించిన హరీష్‌ రావు.. రేవంత్‌కు చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని.. ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలన్నారు హరీష్‌ రావు.

Advertisement
Update:2024-02-15 09:30 IST

తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్‌ వార్ నడుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్‌లో సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బ్యారేజ్‌ను సందర్శించింది. ఇక బుధవారం అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చ జరగ్గా.. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బ్యారేజ్‌ రిపేర్‌ బాధ్యతను కేసీఆర్‌, హరీష్‌లకు అప్పగిస్తానని.. చేసి చూపించాలంటూ సవాల్ విసిరారు.

సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌పై స్పందించిన హరీష్‌ రావు.. రేవంత్‌కు చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని.. ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలన్నారు హరీష్‌ రావు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని మేడిగడ్డ రిపేర్ చేసి చూపిస్తానన్నారు.

కాంగ్రెస్‌ హయాంలోనూ చాలా ప్రాజెక్టులకు సమస్యలు వచ్చాయని.. రిపేర్‌ చేసి వాటిని మళ్లీ పునరుద్ధరించారని చెప్పారు హరీష్ రావు. కాళేశ్వరం మీద విచారణ చేయాలని, దోషులను శిక్షించాలన్న హరీష్‌ రావు.. కానీ రైతులకు అన్యాయం చేయోద్దని సూచించారు.

Tags:    
Advertisement

Similar News