8న బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం
ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Advertisement
తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో 8న బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. 8న మధ్యాహ్నం ఒంటిగంటకు ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్‌లో నిర్వహించే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని సూచించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు.. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రసంగాల్లో చెప్పిన అంశాల్లో ఎంతమేరకు నిజం ఉంది.. చేసుకున్న ప్రచారం ఎంత? అసెంబ్లీలో ప్రభుత్వం లేవనెత్తే అంశాలను ఎలా కౌంటర్ చేయాలి.. ఏ సబ్జెక్ట్ పై ఎవరెవరు రెస్పాండ్ అవ్వాలి అనే అంశాలపై పార్టీ చీఫ్ కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Advertisement