పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు చేరువ కావడానికి కార్యక్రమాలను ముమ్మరం చేసిన BRS

బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ముఖ్యంగా శాసనసభ్యులు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు కోల్పోకుండా ఉండేందుకు కేసీఆర్ ఈ ఆదేశాలిచ్చారు.

Advertisement
Update:2023-03-20 07:27 IST

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ కార్యకర్తలు, ప్రజలకు చేరువయ్యేందుకు కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఆత్మీయ సమ్మేళనాలు (గెట్ టు గెదర్స్) పార్టీ క్యాడర్ మధ్య ఐక్యతను పెంపొందించడానికి, వారి మధ్య అంతరాలను తొలగించేందుకు వేదికలవుతాయని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది.

బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ముఖ్యంగా శాసనసభ్యులు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు కోల్పోకుండా ఉండేందుకు కేసీఆర్ ఈ ఆదేశాలిచ్చారు.

"కొంతమంది ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోని ప్రజలకు, పార్టీ క్యాడర్‌కు అందుబాటులో లేరనే నివేదికలున్నాయి. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కేసీఆర్ హెచ్చరించారు. అలాంటి ఎమ్మెల్యేలు మళ్లీ ప్ర‌జలకు, కార్యకర్తలకు దగ్గర‌ అయ్యేందుకు, తమ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, రాష్ట్రవ్యాప్తంగా గెట్‌ టు గెదర్స్‌ నిర్వహించాలని ఆయన సూచించారు'' అని పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకరు చెప్పారు.

అందుకనుగుణంగానే ఈ ఏడాది జూన్ వరకు పలు రకాల కార్యక్రమాలను పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. అనేక మంది శాసనసభ్యులు ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. పార్టీ క్యాడర్‌తో తమ సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారం క్రితం పార్టీ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం జరిగినప్పటి నుండి, మెజారిటీ ఎమ్మెల్యేలు కార్యకర్తలతో కనీసం రెండు-మూడు సమావేశాలు నిర్వహించారు.

ఎమ్మెల్యేలందరూ తమ క్యాడర్‌ను బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమై ఉండగా, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పార్టీలోని సమస్యలను పరిష్కరించడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 33 జిల్లాలకు ఒక్కో జిల్లాకు పలువురు సమన్వయకర్తలను ఏర్పాటు చేశారు. వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలున్నారు. వారు పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అంతేకాకుండా, రాబోయే నాలుగు నెలల్లో కనీసం వారానికి ఒక జిల్లాలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రులతో సహా పలువురు ముఖ్య నేతలకు కేసీఆర్ సూచించారు.

మరో వైపు BRS నాయకులు, BRS విద్యార్థి (విద్యార్థి విభాగం) ద్వారా ఇంటర్మీడియట్, డిగ్రీ , ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు స్వాగత సమావేశాలు, ఫ్రెషర్స్ మీటింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థులకు చేరువవుతున్నారు. పార్టీ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసేందుకు పెద్దఎత్తున విద్యార్థులను BRS విద్యార్థి విభాగంలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News