ఏడాదిన్నరలోనే ప్రజలకు తెలిసొస్తుంది.. ఫలితాలపై బీఆర్ఎస్ ఫస్ట్ రియాక్షన్
ఇది బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత అని తాను అనుకోవడం లేదన్నారు సునీత. ప్రజలకు ఏడాదిన్నరలోనే తత్వం బోధపడుతుందన్నారు. వాట్ ఈజ్ కేసీఆర్, వాట్ ఈజ్ కాంగ్రెస్ అనేది వారికి అర్థమవుతుందని చెప్పారు సునీత.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నేతలు అధికారికంగా స్పందించడానికి కాస్త తటపటాయిస్తున్న టైమ్ లో.. ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత తనదైన శైలిలో స్పందించారు. ఇది బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత అని తాను అనుకోవడం లేదన్నారు సునీత. ప్రజలకు ఏడాదిన్నరలోనే తత్వం బోధపడుతుందన్నారు. వాట్ ఈజ్ కేసీఆర్, వాట్ ఈజ్ కాంగ్రెస్ అనేది వారికి అర్థమవుతుందని చెప్పారు సునీత.
రెండుసార్లు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చాం కదా, ఈసారి కాంగ్రెస్ కి ఇద్దామని ప్రజలు అనుకుని ఉండొచ్చన్నారు గొంగిడి సునీత. కాంగ్రెస్ ఉచితాలు ఎక్కువైపోయాయని, ఏడాదిన్నరలోనే ఫలితం తెలిసొస్తుందన్నారు. ప్రజలు టేకిట్ ఈజీగా తీసుకున్నారనే విషయం స్పష్టమైందన్నారు సునీత. మార్పు అనేది అర్థమవుతుందని చెప్పారు.
ఈరోజు ఉదయం వరకు బీఆర్ఎస్ గెలుపు ధీమాతోనే ఉంది. అయితే ఫలితాల సరళి చూసి కొంతమంది నేతలు నిరాశకు లోనయ్యారు. ఓడిపోవడం ఖాయమని తెలిసినవారు కౌంటింగ్ కేంద్రాల నుంచి నిష్క్రమించారు. మరికొందరు చివరి వరకు విజయంపై ఆశతో అక్కడే ఉండిపోయారు. అటు కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
♦