కార్యకర్తల కుటుంబాలకు అండగా బీఆర్ఎస్..
పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడంతోపాటు.. రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందిస్తారు. తన టీమ్ ని అలర్ట్ చేస్తారు.
అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కార్యకర్తలను, వారి కుటుంబాలను కాపాడుకోవడంలో బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుంది అని మరోసారి రుజువు చేశారు ఆ పార్టీ నేతలు. ప్రమాదవశాత్తు మరణించిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయా కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వ్యక్తిగతంగా కేటీఆర్ భరోసా..
పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడంతోపాటు.. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కేటీఆర్ వెంటనే స్పందిస్తారు. అనారోగ్య సమస్యలున్నవారు కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేస్తే కచ్చితంగా ఆయన టీమ్ స్పందిస్తుంది, కేటీఆర్ కూడా స్వయంగా వారి వివరాలు కనుక్కుంటారు. తన టీమ్ ద్వారా సాయం అందిస్తారు. వారు కోలుకునే వరకు బాగోగులు చూస్తారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం కావాలన్నా వెంటనే అందించేవారు కేటీఆర్. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన స్పందనలో మార్పు లేదు.
బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా, నాయకులు కొందరు పార్టీని వీడుతున్నా, కార్యకర్తలు మాత్రం గులాబిదళం నుంచి బయటకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. కార్యకర్తల బలమే బీఆర్ఎస్ ని మళ్లీ పునర్ వైభవం తెస్తుందని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తే.. బీఆర్ఎస్ నాయకుల్లో మరింత ధీమా పెరిగే అవకాశముంది.