రేవంత్‌కు బీఆర్ఎస్ కౌంటర్.. చనిపోయిన రైతుల వివరాలతో ట్వీట్
సమయానికి రైతుబంధు అందక, సాగునీళ్లు ఇవ్వక, కరెంట్ కోతలతో, అర్ధరాత్రి బోరు మోటార్లు ఆన్ చేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో, పాము కాట్లతో, అధికారుల వేధింపులతో దాదాపు 209 మంది రైతులు మరణించారని ట్వీట్‌లో స్పష్టం చేసింది.
తెలంగాణలో రైతు కేంద్రంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు 200 మంది రైతులు చనిపోయారని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. చనిపోయిన రైతుల పేర్లు, వివరాలు 48 గంటల్లోగా ఇస్తే నష్ట పరిహారం ఇస్తామంటూ కేసీఆర్‌కు సవాల్ చేశారు. ఆ రైతుల కుటుంబాలను సచివాలయానికి పిలిచి ఆదుకుంటామన్నారు.
ఇటీవలి కాలంలో చనిపోయిన రైతుల వివరాలను తెలుగు స్క్రైబ్ అనే మీడియా సంస్థ కలెక్ట్ చేయగా.. బీఆర్ఎస్ ఆ వివరాలను తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. సమయానికి రైతుబంధు అందక, సాగునీళ్లు ఇవ్వక, కరెంట్ కోతలతో, అర్ధరాత్రి బోరు మోటార్లు ఆన్ చేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో, పాము కాట్లతో, అధికారుల వేధింపులతో దాదాపు 209 మంది రైతులు మరణించారని ట్వీట్‌లో స్పష్టం చేసింది.
ఇచ్చిన మాట ప్రకారం.. దురదృష్టవశాత్తు మరణించిన 209 రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది బీఆర్ఎస్. ఒక్కో రైతు కుటుంబానికి ప్రభుత్వం తరపున 20 లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేసింది.