సింగరేణి వివాదం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాటల యుద్ధం

సింగరేణి వ్యవహారం ఆసక్తికర చర్చకు దారితీసింది. సింగరేణికి బొగ్గు గనులు లేకుండా చేసింది మీరంటే మీరంటూ నేతలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.

Advertisement
Update:2024-06-21 07:31 IST

సింగరేణిని ముంచేసింది మీరంటే మీరంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. సింగరేణికి సొంత గనులు లేకుండా చేశారని, గనుల వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నారని, ఆ పాపం మీదేనంటూ రెండు పార్టీలు వాదనకు దిగడం విశేషం. గత ప్రభుత్వమే సింగరేణిని నాశనం చేసిందని కాంగ్రెస్ అంటుంటే.. కాంగ్రెస్ వల్లే కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.

గోదావరి పరీవాహక ప్రాంతంలోని కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకుల వేలం విషయంలో వివాదం తలెత్తింది. ఆ బొగ్గు బ్లాక్ ల వేలంలో సింగరేణి కూడా పాల్గొనాలని కాంగ్రెస్ తీర్మానించింది. అయితే వేలం లేకుండా వాటిని సింగరేణికే కట్టబెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. గతంలో వేలం వద్దంటూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రధాని మోదీకి లేఖ రాసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు వేలంలో పాల్గొంటామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

గతంలో సింగరేణిని బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటున్నారు కాంగ్రెస్ నేతలు. 2021లో వేలంలో పాల్గొనేందుకు సింగరేణి సుముఖత వ్యక్తం చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుపడిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. అప్పట్లో కోల్ బ్లాక్ లను వారికి అనుకూలమైన రెండు కంపెనీలకు అప్పగించారని అన్నారు. ఆ రెండు కంపెనీల ద్వారా బీఆర్ఎస్, బీజేపీ.. ఎలక్టోరల్ బాండ్ ల రూపంలో లబ్ధి పొందాయని కూడా ఆరోపించారాయన. ఆ రెండు కంపెనీలకు ఇచ్చిన బొగ్గు గనుల్ని రద్దు చేసి.. వాటిని వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని డిమాండ్‌ చేశారాయన. క్విడ్‌ ప్రో కోకు సంబంధించి బీఆర్ఎస్ నేతలతో తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు భట్టి.

సింగరేణి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. సింగరేణికి బొగ్గు గనులు లేకుండా చేసింది మీరంటే మీరంటూ నేతలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News