కేసీఆర్ బస్సు యాత్ర.. ఎప్పటి నుంచో తెలుసా..?
బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్‌పై కేసీఆర్ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించే విధంగా వ్యూహ రచన చేసినట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికలు సమయం సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలన్ని గేరు మార్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వరంగల్ స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన గులాబీ బాస్.. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.
కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 13 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని సమాచారం. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కవరయ్యేలా బస్సు యాత్ర ప్లాన్ చేస్తున్నారు. చేవెళ్ల నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి పార్టీ నేతలు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్‌పై కేసీఆర్ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించే విధంగా వ్యూహ రచన చేసినట్లు సమాచారం. తెలంగాణకు గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన పనులు.. భవిష్యత్తులో బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ సభల్లో కేసీఆర్ వివరిస్తారని తెలుస్తోంది. కేసీఆర్ బస్సు యాత్రతో కేడర్‌లోనూ జోష్ నిండుతుందని పార్టీ భావిస్తోంది.