ఎమ్మెల్యేల ఓరియంటేషన్ సెషన్ బహిష్కరిస్తున్నాం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియంటేషన్ సెషన్ బహిష్కరిస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ప్రారంభానికి ముందే బీఆర్‌ఎస్ సభ్యుల హక్కులకు భంగం కలిగించేలా స్పీకర్ వ్యవహరించారని, మొదటి రోజే తమను సభలోకి రాకుండా పోలీసులతో అరెస్ట్ చేయించారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎత్తి చూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారని, తమ పార్టీ శాసన సభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపులపైన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ తమ పార్టీ సభ్యుల గొంతు కొక్కేలా వ్యవహరించారని, తమకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు. తమ పార్టీ నుంచి ఎన్నికైన వారిలో కొందరు మాత్రమే కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారని, ఏకపక్షంగా స్పీకర్ వ్యవహరిస్తున్నందన, ఆ వ్యవహారశైలిని నిరిసిస్తూనే ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఇకనైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని కోరుతున్నామని అన్నారు.