మిగిలిన 9 మందికి బీఆర్ఎస్ బీఫామ్ ల పంపిణీ..
ఈరోజు 9 నియోజకవర్గాల విషయంలో తుది నిర్ణయం తీసుకుని వారికి కూడా బీ ఫామ్ లు అందజేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ బీ ఫామ్ ల పంపిణీ పూర్తయింది. ఇప్పటికే 110 నియోజకవర్గాలకు బీఫామ్ ల పంపిణీ పూర్తి కాగా మిగిలిన 9 నియోజకవర్గాల అభ్యర్థులకు ఈరోజు మంత్రి కేటీఆర్ బీఫామ్ లు అందించారు. అలంపూర్ కు గతంలో ప్రకటించిన అబ్రహాంకు కాకుండా విజేయుడికి బీ ఫామ్ అందించారు. గోషామహల్ అభ్యర్థిగా నంద కిషోర్ వ్యాస్, నాంపల్లి అభ్యర్థిగా ఆనంద్ కుమార్ గౌడ్ ను ఖరారు చేసి వారికి కూడా బీ ఫామ్ లు అందజేశారు.
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు 118 మంది అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. కేసీఆర్ ఒక్కరే రెండు స్థానాలకు పోటీ పడుతున్నారు. ఆయనతో కలిపి మొత్తం అభ్యర్థుల సంఖ్య 118. ఈరోజు 9 నియోజకవర్గాల విషయంలో తుది నిర్ణయం తీసుకుని వారికి కూడా బీ ఫామ్ లు అందజేశారు.
చాంద్రాయణ గుట్ట - ఎం.సీతారాం రెడ్డి
యాకత్ పురా – సామా సుందర్ రెడ్డి
బహుదూర్ పుర – ఇనాయత్ అలీ బక్రీ
మలక్ పేట- తీగల అజిత్ రెడ్డి
కార్వాన్ – అయిందాల కృష్ణ
చార్మినార్ – సలావుద్దీన్ లోడి
నాంపల్లి – సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్
గోషామహాల్ – నంద కిషోర్ వ్యాస్
అలంపూర్ – విజేయుడు
నామినేషన్లకు మూడు రోజులే గడువు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లకు ఇంకా 3 రోజులే గడువు ఉంది. ఈనెల 10తో నామినేషన్ల దాఖలు పూర్తవుతుంది. 13వతేదీ స్క్రూటినీ ఉంటుంది. 15వతేదీ ఉపసంహరణకు ఆఖరు. అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థుల లిస్ట్ అధికారికంగా ప్రకటిస్తారు. ఈనెల 30న సింగిల్ ఫేజ్ లో ఎలక్షన్స్ జరుగుతాయి. డిసెంబర్-3న తెలంగాణ సహా మొత్తం 5 రాష్ట్రాల |ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.