లగచర్ల రైతులను జైల్లో పెట్టడంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
మూసి నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించాలని సీపీఐ వాయిదా ప్రతిపాదన
Advertisement
సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం లగచర్లలో ఫార్మా విలేజ్ కు భూసేకరణ ను నిరసిస్తూ కలెక్టర్ ను అడ్డుకున్న రైతులను నెల రోజులుగా జైలులో నిర్బందించడం పై బీఆర్ఎస్ అసెంబ్లీ లో వాయిదా తీర్మానం ఇచ్చింది. మాజీ మంత్రి హరీశ్ రావు వాయిదా తీర్మానం ఇచ్చారు. రైతుల నిర్బంధం పై అసెంబ్లీలో చర్చించాలని కోరారు. మూసి బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాలని, మెరుగైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ సీపీఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం ఇచ్చారు.
Advertisement