లక్షల బుల్డోజర్లు తెచ్చినా పేదల ఇండ్లు కూల్చలేరు
ఆ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
లక్షల బుల్డోజర్లు తెచ్చినా పేదల ఇండ్లు కూల్చలేరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో రాత్రి నిద్రలో భాగంగా శనివారం రాత్రి అంబర్‌పేట నియోజకవర్గంలోని తులసీ రామ్‌నగర్ లో బస చేసిన మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఉదయం సమీప ప్రాంత ప్రజలతో సమావేశమయ్యారు. లక్ష బుల్డోజర్లు తెచ్చినా పేదల ఇండ్లు కూల్చలేరని తేల్చిచెప్పారు. బలవంతంగా ఇండ్లు కూల్చాలని చూస్తే బాధితులను, వారికి అండగా నిలిచిన వాళ్లను పెట్టేందుకు ఇప్పుడున్న జైళ్లు సరిపోవన్నారు. పేదల ఇండ్లను కూల్చబోమని హామీ ఇస్తే మూసీ ప్రక్షాళనకు సహకరిస్తానన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ నిద్రలో భాగంగా చైతన్యపురిలో బస చేశారు. అంతకు ముందు స్థానికులతో రచ్చబండ నిర్వహించారు. డీపీఆర్ లేకుండానే మూసీ ప్రాజెక్ట్ ఎలా చేపడుతారని ప్రశ్నించారు. ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మూసీ నిద్రలో పాల్గొన్నారు.