కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై 6న బీజేపీ బహిరంగ సభ : కిషన్‌రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని కేంద్రమంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు.

Advertisement
Update:2024-11-30 17:37 IST

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని కేంద్రమంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ సర్కార్ నుంచి నోటిఫికేషన్లు లేవు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించిన వాటికి వీళ్లు భర్తీ చేశామని చెప్తునారని కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసేలా ఉద్యమం చేయాలని నేతలను పిలుపునిచ్చారు. కొత్త రక్తం పార్టీలో చెరబోతుంది.. గ్రామ స్థాయి నుంచి జాతీయి స్థాయి వరకు కొత్త నాయకత్వం రాబోతుందని అన్నారు.

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వం వచ్చేలా కమిటీలు వేయాలని సూచించారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ప్రధాని మోదీ చెప్పారని ఆయన తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ప్రధాని మోదీ స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. రేపు బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం. అసెంబ్లీ, జిల్లలా వారీగా ఛార్జ్‌షీట్‌ తయారు చేసి విడుదల చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 6న సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం ఉంది’ అని కిషన్ రెడ్డి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News