TSPSC పేపర్ లీకేజ్ లో బీజేపీ హస్తం ? కోడై కూస్తున్న సోషల్ మీడియా!

బీజేపీకి యువతను దూరం చేసెందుకే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను ఇస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలను నెటిజనులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రాజశేఖర్ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న ఫోటోలు, ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో బీజేపీకి మద్దతుగా పెట్టిన పోస్టులను నెటిజనులు రీ పోస్ట్ చేసి ఇదంతా బీజేపీ కుట్రగా అభివర్ణిస్తున్నారు.

Advertisement
Update:2023-03-15 13:24 IST

TSPSC పేపర్ లీకేజీ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగామారింది. జరగాల్సిన పరీక్షలు ఆగిపోయాయి. వేలాది మంది నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. మరో వైపు పోలీసులు ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏ2 గా ఉన్న రాజశేఖర్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. ఆయన బీజేపీ క్రియాశీల కార్యకర్త అని, కావాలనే బీజేపీ ఇదంతా చేసిందని నెటిజనులు రుజువులతో సహా ఆరోపిస్తున్నారు.

బీజేపీకి యువతను దూరం చేసెందుకే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను ఇస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలను నెటిజనులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రాజశేఖర్ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న ఫోటోలు, ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో బీజేపీకి మద్దతుగా పెట్టిన పోస్టులను నెటిజనులు రీ పోస్ట్ చేసి ఇదంతా బీజేపీ కుట్రగా అభివర్ణిస్తున్నారు.

రాజశేఖర్ బీజేపీ ప్రచారంలో పాల్గొన్న ఫోటోను, కిషన్ రెడ్డిని గెలిపించాలంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులను ట్విట్టర్ లో షేర్ చేసిన మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ క్రిశాంక్,

''మీరు చూస్తున్న చిత్రాలలో ఉన్నది TSPSC పేపర్ లీక్ కేసులో A2 నిందితుడు రాజశేఖర్.

ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నాడు...

ఇది తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ కుట్రనా? ?'' అనికామెంట్ చేశారు.

''తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చి యువతను బీజేపీ నుంచి దూరం చేస్తుంది అని బండి సంజయ్ మాట్లాడినప్పుడే అర్థం అయ్యింది వీళ్ళు ఏదో ఒకటి చేసి ఉద్యోగాలు ఆపే కుట్ర చేస్తారు అని'' అని ప్రవీణ్ ముదిరాజ్ అనే నెటిజ‌న్ కామెంట్ చేశారు.

''కావాలనే Telangana ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి bjp నేతలు కార్యకర్తలు పేపర్ లీక్ చేసి Telangana విద్యార్ధుల జీవితం నాశనం చేస్తున్నారు'' అని రాజేశ్ గంగిరెడ్డి అనే నెటిజన్ అన్నారు.

ఇలా అనేక వందల మంది నెటిజనులు ట్విట్టర్ లో బీజేపీ పై విరుచుకపడుతున్నారు. బీఆరెస్ మీద ఉన్న కసిని బీజేపీ నాయకులు నిరుద్యోగులమీద చూపిస్తున్నారని మండిపడుతున్నారు. అధికారం పొందడం కోసం ఇలా నిరుద్యోగులను బలిచేయొద్దని అందుకు వేరే దారులు వెతుక్కోవాలని బీజేపీ నాయకులను వేడుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News