ట్విట్టర్ లో 'బీజేపీ గూండాస్' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ నెంబర్ 1

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్రను పోలీసులు నిలిపివేశారనే ఆక్రోశంతో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన పేరుతో ప్రజలపై దాడులకు దిగారనే ఆరోపణలొచ్చాయి. దాడులు చేస్తున్న వీడియోలు ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి. 'బీజేపీ గూండాస్' అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వాళ్ళ ట్రెండింగ్ నెంబర్ వన్ అయ్యింది.

Advertisement
Update:2022-08-24 18:12 IST

బీజేపీ కార్యకర్తలునిరసన ప్రదర్శనల పేరుతో ప్రజలపై దాడులు చేస్తున్న వీడియోలి ట్విట్టర్ లో వైరల్ గా మారాయి. బండి సంజయ్ పాద యాత్ర సందర్భంగా నిన్న జనగాంలో రోడ్డు మీద బైటాయించి చేసిన హడావుడిలో వాహనాలపై వెళ్తున్న ప్రజలపై దాడులు జరిగాయి. బైక్ లపై, ఆటోలలో, కార్లలో వెళ్తున్న ప్రయాణీకులపై బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు దిగడం వాహనాల లోపల ప్రయాణీకులు ఉండగానే ఆ వాహనాల అద్దాలు పగులగొట్టడం, ప్రజలపైకి రాళ్ళు విసరడం వంటి పలు వీడియోలు ట్వీట్టర్ లో వైరల్ అవడమే కాక 'బీజేపీ గూండాస్ ' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఆ హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలోనెంబర్ 1 గా నిల్చింది.

''ప్రపంచం ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & టెక్నాలజీ గురించి ఆలోచిస్తూ ముందుకు సాగుతోంది..!!

భారతదేశంలో BJP కేవలం ద్వేషపూరిత వ్యాఖ్యలు, అల్లర్లు, మత తగాదాలపై దృష్టి సారిస్తూ దేశాన్ని వెనక్కి నెడుతోంది..!!'' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా...

''బీజేపీ గూండాయిజాన్ని ప్రోత్సహిస్తోంది, సమాజంలో విషం చిమ్ముతూ సామాజిక సామరస్యాన్ని ధ్వంసం చేస్తోంది. బీజేపీని, దాని ప్రాయోజిత గూండాయిజాన్ని ఎంత త్వరగా అంతం చేస్తే సమాజానికి అంత మంచిది.'' అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. 



Tags:    
Advertisement

Similar News