ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు బీజేపీ షాక్..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తమ్మీద బీజేపీ 8 స్థానాలు గెలుచుకోగా.. ఏడు స్థానాలు ఉత్తర తెలంగాణలోనే గెలుచుకుంది. నిజామాబాద్‌లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి స్థానాలు గెలుచుకుంది.
ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్‌కు నిన్న, మొన్నటి వరకు కంచుకోట. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కోట బీటలు వారింది. అనూహ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బతీసినట్లయింది. బీజేపీ అభ్యర్థులు చాలా చోట్ల మంచి ఓట్లు సాధించడం.. బీఆర్‌ఎస్‌కు మైనస్‌గా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తమ్మీద బీజేపీ 8 స్థానాలు గెలుచుకోగా.. ఏడు స్థానాలు ఉత్తర తెలంగాణలోనే గెలుచుకుంది. నిజామాబాద్‌లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి స్థానాలు గెలుచుకుంది. ఇక ఆదిలాబాద్‌లో ఏకంగా బీజేపీ 4 స్థానాలు గెలుచుంది. ముథోల్, నిర్మల్, సిర్పూర్, ఆదిలాబాద్ స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన ఒక్క స్థానం రాజాసింగ్‌ది కావడం విశేషం.
ఇక దక్షిణ తెలంగాణలో బీజేపీ ఒక్క సీటు కూడా సాధించలేదు. కల్వకుర్తి నుంచి తల్లోజు ఆచారి గెలుస్తాడని మొదటి నుంచి అంచనా వేసినప్పటికీ.. 3 వేల ఓట్ల తేడాతో ఆయనను మరోసారి ఓటమి పలకరించింది.