బీజేపీ రెండో జాబితా.. తెలంగాణలో ఆరు ఎంపీ టికెట్లు ఖరారు
ఊహించినట్లుగానే మెదక్ ఎంపీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు పోటీ చేసే అవకాశం కల్పించింది.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ 72 మందితో లోక్‌సభ ఎన్నికలకు రెండో జాబితాను ప్రకటించింది. ఇందులో తెలంగాణలో ఆరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో తెలంగాణలో 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. వరంగల్, ఖమ్మం స్థానాలను ఇంకా పెండింగ్‌లోనే ఉంచారు.
ముగ్గురు బీఆర్ఎస్ బ్యాచ్
తాజాగా ప్రకటించిన ఆరు పేర్లలో ముగ్గురు బీఆర్ఎస్ మాజీ నేతలే కావడం గమనార్హం. ఇందులో ఆదిలాబాద్ నుంచి గోడెం నగేశ్, మహబూబాబాద్ నుంచి సీతారాంనాయక్, నల్గొండ నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిలకు టికెట్లు కేటాయించారు.
లోక్‌సభ బరిలో రఘునందనరావు, డీకే అరుణ
ఊహించినట్లుగానే మెదక్ ఎంపీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు పోటీ చేసే అవకాశం కల్పించింది. మహబూబ్‌నగర్‌లో జితేందర్‌రెడ్డి చివరి వరకు పోరాడినా, మాజీ మంత్రి డీకే అరుణ టికెట్ తెచ్చుకోగలిగారు. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ కమలం గుర్తుపై పోటీ చేయనున్నారు.