ఫాక్స్‌కాన్:కృషి రాష్ట్రానిది... క్రెడిట్ మాత్రం బీజేపీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం
సినిమా స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వంటి వారిని మోడీ రాజ్యసభకు నామినేట్ చేయడం వల్లనే RRR ఆస్కార్ గెలుచుకుందని ప్రచారం చేసుకున్న బిజెపి నాయకులు ఇప్పుడు తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ తెలంగాణ లో యూనిట్ ను నెలకొల్పడాన్ని మోడీ ఖాతాలో వేసేస్తున్నారు .
అభివృద్ధిని సాధించడంలో ఇతరులు చేసిన కృషిని, ఫలితాలను తమ ఖాతాలో వేసుకునే ఏ ఒక్క అవకాశాన్ని బిజెపి వదిలిపెట్టదు.
సినిమా స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వంటి వారిని మోడీ రాజ్యసభకు నామినేట్ చేయడం వల్లనే RRR ఆస్కార్ గెలుచుకుందని ప్రచారం చేసుకున్న బిజెపి నాయకులు ఇప్పుడు తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ తెలంగాణ లో యూనిట్ ను నెలకొల్పడాన్ని మోడీ ఖాతాలో వేసేస్తున్నారు .
కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, తెలంగాణలో యూనిట్ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్ ప్లాన్‌లపై ఒక వార్తా నివేదికను ట్విట్టర్ లో షేర్ చేస్తూ, ఆత్మనిర్భర్ ఉత్పత్తి వ్యవస్థను అభివృద్ధి చేయడంలో మోదీ సాధించిన విజయం ఇది అని అన్నారు!
ఆయనతో పాటు గొంతు కలిపిన మరో బీజేపీ నాయకుడు,కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేస్తూ, “ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో భారత్ 300 బిలియన్ డాలర్ల కు చేరాలన్న నరేంద్ర మోడీ లక్ష్యం మరింత ఊపందుకుంది. యాపిల్ ఐఫోన్‌ల తర్వాత ఇప్పుడు ఎయిర్‌పాడ్‌లు భారతదేశంలో తయారవుతున్నాయి.'' అని కామెంట్ చేశారు.
నిజానికి ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడానికి ముందు. ఆ సంస్థ చైర్మెన్ యంగ్ లియు స్వయంగా ఇక్కడికి వచ్చారు. పెట్టుబడిదారులకు ఇక్కడున్న అవకాశాలు, సౌకర్యాలు, మౌలిక వసతులు రాష్ట్ర ప్రభుత్వం ఆయన కు చూపించింది. ఆ తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కూ లేఖ రాస్తూ... తెలంగాణ పరివర్తన, అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషిని ప్రత్యక్షంగా చూశానని, భవిష్యత్తులో కూడాకేసీఆర్ తో కలసి పనిచేయాలని ఎదురు చూస్తున్నానని ఆయన విజన్‌తో స్ఫూర్తి పొందానని చెప్పారు.
బీజేపీ నేతలు మాత్రం ఫాక్స్ కాన్ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి తహతహలాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.