కేసీఆర్‌ దెబ్బకు బీజేపీ రూటు మార్చిందా?

నిజానికి బీజేపీ టార్గెట్ అంతా బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ నేతలు ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటారు కానీ బీఆర్ఎస్ నేతలను చేర్చుకునే విషయంలో టార్గెట్లు పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు రూటు మార్చి కాంగ్రెస్ నేతలపైన టార్గెట్ పెట్టారు.

Advertisement
Update:2022-12-20 11:39 IST

ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలను పార్టీలోకి చేర్చుకునే విషయంలో కేసీఆర్‌ దెబ్బ బీజేపీ మీద చాలా బలంగానే పడినట్లుంది. ఈ మధ్యనే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను కొనేందుకు బీజేపీ తరపున ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. సీన్‌లో ఎక్కడా డైరెక్టుగా బీజేపీ నేతలు లేకపోయినా ఆడియో, వీడియో సంభాషణల్లో మాత్రం బేరాలాడినవాళ్ళు పదేపదే పార్టీ అగ్రనేతల పేర్లను ప్రస్తావించిన విషయం అందరికీ తెలిసిందే.

ఆడియో, వీడియో ఆధారంగా కేసీఆర్‌ డైరెక్టుగా బీజేపీ అగ్రనేతలపైనే బాణాలు ఎక్కుపెట్టారు. దాంతో కమలనాథులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు సీనియర్లు తిరుగుబాటు లేవదీశారు. అలా తిరుగుబాటు లేవదీసిన వాళ్ళతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టచ్‌లోకి వెళ్ళారట. ఫోన్లో తిరుగుబాటు నేతలతో మాట్లాడి వాళ్ళని బీజేపీలో చేరేట్లుగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.

నిజానికి బీజేపీ టార్గెట్ అంతా బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ నేతలు ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటారు కానీ బీఆర్ఎస్ నేతలను చేర్చుకునే విషయంలో టార్గెట్లు పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు రూటు మార్చి కాంగ్రెస్ నేతలపైన టార్గెట్ పెట్టారు. దీంతోనే కేసీఆర్‌ అంటే కమలనాథులు ఎంతగా భయపడిపోతున్నారో అర్ధమవుతోంది. కాంగ్రెస్‌లో వివాదాలను అడ్వాంటేజ్ తీసుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. సీనియర్ల డిమాండ్లలో ఎన్ని వీలైతే అన్ని తీర్చటం ద్వారా వాళ్ళల్లో కొందరినైనా బీజేపీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.

ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్లందరినీ బీజేపీలో చేరమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బంపరాఫర్ ఇచ్చారు. రేవంత్‌కు వ్యతిరేకంగా దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రేమసాగర్ రావు లాంటి సీనియర్లు బహిరంగంగానే తిరుగుబాటు లేవదీశారు. వీళ్ళకే ఇప్పుడు బీజేపీ గాలమేస్తోంది. బీఆర్ఎస్ జోలికెళ్ళే ధైర్యం చాలకే రూటుమార్చిన బీజేపీ నేతలు కాంగ్రెస్ సీనియర్లకు గాలమేస్తున్నట్లు అర్ధమైపోతోంది.

Tags:    
Advertisement

Similar News