విజయశాంతికి బీజేపీ బిగ్‌ షాక్‌..!

గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు విజయశాంతి. కేవలం సోషల్‌మీడియాలో ట్వీట్లకు మాత్రమే పరిమితమవుతున్నారు.

Advertisement
Update:2023-11-06 14:58 IST

విజయశాంతికి బీజేపీ బిగ్‌ షాక్‌..!

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతికి షాక్‌ ఇచ్చింది ఆ పార్టీ అధిష్టానం. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం కోసం 40 మంది నేతలతో కూడిన జాబితాను అధిష్టానం రిలీజ్ చేసింది. అయితే ఈ జాబితాలో విజయశాంతికి చోటు దక్కలేదు. పార్టీ మారుతారన్న ప్రచారంతోనే విజయశాంతిని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. విజయశాంతితో ఇప్పటివరకు పార్టీకి చెందిన నేతలు కనీసం చర్చలు కూడా చేయడం లేదు. ప్రస్తుతం ఆందోళనల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు విజయశాంతి.

గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు విజయశాంతి. కేవలం సోషల్‌మీడియాలో ట్వీట్లకు మాత్రమే పరిమితమవుతున్నారు. బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన నాటి నుంచి పార్టీ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీంతో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారాన్ని విజయశాంతి ప్రత్యక్షంగా ఖండించలేదు.

ఇక తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి రానున్న నేతల్లో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నారు. ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరితో పాటు పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు సైతం జాబితాలో చోటు దక్కింది.

బీజేపీ రిలీజ్ చేసిన లిస్ట్ ఇదే..

నరేంద్ర మోడీ

జేపీ నడ్డా

రాజ్‌నాథ్‌ సింగ్‌

అమిత్‌షా

నితిన్‌ గడ్కరీ

యడియూరప్ప

కె.లక్ష్మణ్‌

యోగి ఆదిత్యనాథ్‌

పీయూష్ గోయల్‌

నిర్మలా సీతారామన్‌

స్మృతి ఇరానీ

పురుషోత్తం రూపాలా

అర్జున్‌ ముండా

భూపేంద్రయాదవ్‌

కిషన్‌రెడ్డి

సాధ్వి నిరంజన్‌ జ్యోతి

ఎల్‌.మురుగన్‌

ప్రకాశ్‌ జావడేకర్‌

తరుణ్‌ ఛుగ్‌

సునీల్ బన్సల్‌

బండి సంజయ్‌

అరవింద్‌ మేనన్‌

డీకే అరుణ

పి.మురళీధర్‌రావు

దగ్గుబాటి పురందేశ్వరి

రవికిషన్‌

పొంగులేటి సుధాకర్‌రెడ్డి

జితేందర్‌రెడ్డి

గరికపాటి మోహన్‌రావు

ఈటల రాజేందర్‌

ధర్మపురి అర్వింద్‌

సోయం బాపూరావు

రాజాసింగ్‌

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

బూర నర్సయ్యగౌడ్‌

గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

దుగ్యాల ప్రదీప్‌కుమార్‌

బంగారు శృతి

కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌

టి.కృష్ణ ప్రసాద్‌

Tags:    
Advertisement

Similar News