మునుగోడు మాదే.. జాతకం చూపించిన బీజేపీ..

ఇప్పటి నుంచే పార్టీలన్నీ మునుగోడుపై ఫోకస్ పెంచాయి. కానీ బీజేపీ మాత్రం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ సీటు మాదేనంటోంది. అభివృద్ధి, సంక్షేమం, అధికార పార్టీ వైఫల్యం.. ఇలాంటివేవీ కారణాలు కావంట. ఆ ఒకే ఒక్క కారణం రాజగోపాల్ రెడ్డి అనే పేరు.

Advertisement
Update:2022-08-04 08:25 IST

బీజేపీ నేతలు సైన్స్ కంటే జ్యోతిష్యం, జాతకం, సంఖ్యా శాస్త్రాలను ఎక్కువగా నమ్ముతారని అంటారు. పాఠ్యపుస్తకాల్లో కూడా జ్యోతిష్యానికి సంబంధించిన సబ్జెక్ట్ లు పెట్టడం, కరోనా టైమ్ లో టీకా కంటే ముందు పతంజలి నాటు మందు కరోనిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఇలాంటి చాలా ఉదాహరణలున్నాయి. అలాంటి బీజేపీ ఇప్పుడు ఓ లాజిక్ ప్రకారం తెలంగాణలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం తమదేనంటోంది. ఇటీవలే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ ఆమోదం, ఎన్నికల కమిషన్ ప్రకటన.. ఇలాంటి వ్యవహారాలన్నీ ఉన్నా.. ఇప్పటి నుంచే పార్టీలన్నీ మునుగోడుపై ఫోకస్ పెంచాయి. కానీ బీజేపీ మాత్రం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ సీటు మాదేనంటోంది. అభివృద్ధి, సంక్షేమం, అధికార పార్టీ వైఫల్యం.. ఇలాంటివేవీ కారణాలు కావంట. ఆ ఒకే ఒక్క కారణం రాజగోపాల్ రెడ్డి అనే పేరు.

ఆమధ్య ఓ తెలుగు సినిమాలో హీరో పేరు చెబితేనే వైబ్రేషన్స్ ఉన్నాయంటుంది హీరోయిన్. సరిగ్గా ఇప్పుడు తెలంగాణ బీజేపీ కూడా నాయకుల పేర్లు 'R' అనే అక్షరంతో మొదలైతే చాలు వైబ్రేషన్స్ వస్తాయని ఆశపడుతోంది. దీనికి కారణం ఇంతకు ముందు RRR లు ఇలా సంచలనం సృష్టించడమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున రాజాసింగ్(R) ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్‌రావు(R) విజయం సాధించి రాజాసింగ్ కి జతయ్యారు. ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికలో రాజేందర్(R) విజయం సాధించి ఆ ఇద్దరితో కలిశారు. మొత్తంగా RRR గా వీరు పేరుపడ్డారు. అదే సెంటిమెంట్ కొనసాగి ఇప్పుడు మునుగోడులో కూడా రాజగోపాల్ రెడ్డి(R) విజయం తథ్యమని అంటున్నారు బీజేపీ నేతలు.

సంఖ్యా శాస్త్రమే గెలిపిస్తుంది..

ప్రస్తుతం బీజేపీ ఫోకస్ అంతా సంఖ్యా శాస్త్రంపైనే ఉందన్నమాట. R అనే అక్షరంతో ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి, నాలుగో ఎమ్మెల్యే కూడా అదే సెంటిమెంట్ తో గెలుస్తారని చెబుతున్నారు. మునుగోడు మాదేనంటూ సవాళ్లు విసురుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా.. బీజేపీ మాత్రం కాస్త హుషారుగా, ధీమాగా బరిలోకి దిగడానికి ఈ సెంటిమెంటే ప్రధాన కారణం అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News