8 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్‌.. లిస్టు ఇదే.!

మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉన్నట్లు సమాచారం. ఈ సీటు కోసం దాదాపు 20 మందికిపైగా పోటీ పడుతున్నారని తెలుస్తోంది.

Advertisement
Update:2024-01-03 11:21 IST

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా సంక్రాంతి తర్వాత 8 నుంచి 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుందని సమాచారం. ఇప్పటికే నలుగురు సిట్టింగ్ ఎంపీలు ఆదిలాబాద్‌- సోయం బాపురావు, కరీంనగర్-బండి సంజయ్‌, నిజామాబాద్- ధర్మపురి అర్వింద్‌, సికింద్రాబాద్ - కిషన్‌ రెడ్డిల పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీజేపీ అధిష్టానం.. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మెదక్‌ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత అధికారికంగా ఈ జాబితాను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

జనవరి ఆఖరుకల్లా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ఫైనల్ చేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ప్రచారానికి అభ్యర్థులకు వీలైనంత సమయం దొరుకుతుందనేది ఆలోచన. ఇక ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ సర్వే కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివర్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి ఈ సర్వేను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉన్నట్లు సమాచారం. ఈ సీటు కోసం దాదాపు 20 మందికిపైగా పోటీ పడుతున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చాలా స్థానాల్లో అభ్యర్థులు కరువయ్యారు. అందుబాటులో ఉన్న వారిని ఆయా చోట్ల బరిలో నిలిపింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో అభ్యర్థులందరిని కేంద్ర బృందం ఖరారు చేసిందని సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని పార్టీ అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 7 నుంచి ఎన్నికలకు సంబంధించిన కమిటీలను బీజేపీ ప్రకటించనుంది.

Tags:    
Advertisement

Similar News