కేసీఆర్ కి వెరైటీగా బర్త్ డే విషెస్.. కేటీఆర్ ట్వీట్ వైరల్

జెండా పట్టుకుని 14వేల అడుగుల ఎత్తులో కేసీఆర్ కి శుభాకాంక్షలు చెప్పిన ఆయన, ఆ తర్వాత ప్యారాచూట్ సహాయంతో కిందకు దిగారు. ఈ వైరల్ వీడియోని రీట్వీట్ చేస్తూ సంతోష్ రావుని ప్రత్యేకంగా అభినందించారు మంత్రి కేటీఆర్.

Advertisement
Update:2023-02-17 10:52 IST

ఉద్యమ నాయకుడు, కార్యసాధకుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కొంతమంది వెరైటీగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తెలంగాణకు చెందిన ఎన్నారై సంతోష్ రావు14వేల అడుగుల ఎత్తులో కేసీఆర్ ఫొటోతో కూడిన బీఆర్ఎస్ జెండా ఎగురవేసి వెరైటీగా విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సార్ అంటూ భూమికి 14వేల అడుగుల ఎత్తులో ఆయన నినదించారు.


డల్లాస్ లోని స్కై డైవ్ స్పేస్ ల్యాండ్ నుంచి ప్రత్యేక విమానంలో పైకి ఎగిరిన సంతోష్ రావు, అక్కడినుంచి స్కై డైవ్ చేశారు. రెండు చేతులతో బీఆర్ఎస్ జెండా పట్టుకున్నారు. దానిపై కేసీఆర్ ఫొటోతోపాటు పుట్టినరోజు శుభాకాంక్షలు అని కూడా రాశారు. ఆ జెండా పట్టుకుని 14వేల అడుగుల ఎత్తులో కేసీఆర్ కి శుభాకాంక్షలు చెప్పిన ఆయన, ఆ తర్వాత ప్యారాచూట్ సహాయంతో కిందకు దిగారు. ఈ వైరల్ వీడియోని రీట్వీట్ చేస్తూ సంతోష్ రావుని ప్రత్యేకంగా అభినందించారు మంత్రి కేటీఆర్. మీ అభిమానాన్ని చాటి చెప్పేందుకు మీరు ఎంచుకున్న విధానం గ్రేట్ అంటూ మంత్రి కేటీఆర్, సాహసి సంతోష్ రావుని అభినందించారు. స్కై డైవ్ చేస్తూ ఆయన విషెస్ చెప్పిన వీడియోని రీట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

వనపర్తి రైతుల అభిమానం..

సీఎం కేసీఆర్ పై తమకున్న అభిమానాన్ని వెరైటీగా చాటుకున్నారు వనపర్తి రైతులు. పల్లీలు, ఉలవలతో కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రైతు బాంధవుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో కేసీఆర్ చిత్రపటాన్ని వేరుశెనగ పప్పు, ఉలవలు, ఉప్పు, రంగులతో రూపొందించారు. వనపర్తి మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు.




Tags:    
Advertisement

Similar News