తెలుగుదేశం పార్టీకి బిగ్‌ షాక్‌.. కాసాని గుడ్‌ బై..!

దాదాపు 87 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుందన్నారు. అయితే ఆయన అభిప్రాయానికి విరుద్ధంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
Update:2023-10-30 20:37 IST

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బిగ్‌షాక్‌ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేయట్లేదని అధిష్టానం నిర్ణయించడంతో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర‌ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పార్టీ సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణలో పోటీ చేయాలని టీడీపీ క్యాడర్ కోరుతున్నప్పటికీ.. పోటీ చేయోద్దని చంద్రబాబు చెప్పారన్నారు కాసాని. పోటీకి అంతా సిద్ధం చేశాకే విరమించుకున్నారని చెప్పారు. లోకేశ్‌కు 20 సార్లు ఫోన్‌ చేసిన సమాధానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీని తాను బలోపేతం చేశానన్నారు. కార్యకర్తలకు అన్యాయం చేసి పార్టీలో ఉండాలనుకోవడం లేదన్నారు. కార్యకర్తలకు సమాధానం చెప్పలేకే పార్టీకి రాజీనామా చేశానన్నారు.

తెలంగాణలో టీడీపీ పోటీలో ఉంటుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కాసాని జ్ఞానేశ్వర్ సైతం ఇదే మాట చెప్తూ వచ్చారు. దాదాపు 87 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుందన్నారు. అయితే ఆయన అభిప్రాయానికి విరుద్ధంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్‌లో చేరతారని, ఆయనకు మల్కాజిగిరి ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News