నటుడు మోహన్ బాబుకు భారీ షాక్

నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కోర్టులో చుక్కెదురైంది

Advertisement
Update:2024-12-13 15:36 IST

నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కోర్టులో చుక్కెదురైంది . ఆయన దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు‌ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. న్యాయ సలహా అనంతరం ఎఫ్‌ఐ‌ఆర్ పోలీసుల సెక్షన్స్ మార్చిన విషయం తెలిసిందే. బీఎన్‌ఎస్ 109 సెక్షన్‌ కింద మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జల్ పల్లిలోని తన నివాసం వద్ద జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. పిటిషన్ ను కొట్టివేసింది.

Tags:    
Advertisement

Similar News