భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

ట్యాపింగ్‌ కేసులో నిందితుడు భుజంగరావుకు బిగ్ షాక్‌ తగిలింది. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తూ ఇవాళ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.

Advertisement
Update:2024-11-13 14:48 IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలని ఆయన కోర్టులో పిటివేషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రేపు సాయంత్రం 4 గంటల్లోపు కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. రేపటితో భుజంగరావు మధ్యంతర బెయిల్ గడువు ముగియనుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భుజంగరావు ఏ2 నిందితుడు. అనారోగ్య కారణాల రిత్యా ఈ ఏడాది ఆగష్టు 19వ తేదీన ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

ఆ తర్వాత దానిని పొడగిస్తూ వచ్చింది. అయితే కిందటి నెలలో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం పిటిషన్‌ వేయగా.. కోర్టు దానిని తిరస్కరించింది. అదే టైంలో మధ్యంతర బెయిల్‌ విషయంలో మరికొంత ఊరట ఇచ్చింది. ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్ట్‌ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్‌ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్‌ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్‌ కార్నర్‌ నోటీసులు సైతం జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News