కాంగ్రెస్ లో పెరుగుతున్న కమిటీల చిచ్చు... అధికార ప్రతినిధి పదవికి బెల్లయ్య నాయక్‌ రాజీనామా

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్ తన పదవికి రాజీనామా చేశారు. తనకు కొత్త కమిటీల్లో చోటు కల్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెల్లయ్య‍ నాయక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి లేఖ రాశాడు. పార్టీలో ఎస్ టీలకు సరైన స్థానం కల్పించడంలేదని ఆయన ఆరోపించారు.

Advertisement
Update:2022-12-12 14:08 IST

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఎదో ఓ రగడ కొనసాగుతూనే ఉంటుంది. నాయకుల అసంత్రుప్తులు, వర్గాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆ పార్టీకి సహజసిద్దం. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కమిటీల చిచ్చు రాజుకుంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యూనిట్ లో పీసీసీ ఎగ్జి క్యూటీవ్ కమిటీ, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ...ఇలా పలు కమిటీలను ఏఐసీసీ నియమించింది. ఆ రోజునుండే ఆ పార్టీలో చిచ్చు మొదలయ్యింది. ఏ కమిటీలోనూ స్థానం దొరకని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అసంత్రుప్తి వ్యక్తం చేయగా, కొండా సురేఖ తనకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ లో స్థానం దక్కనందుకు పీసీసీ ఎగ్జ్ క్యూటీవ్ కమిటీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆమె బాటలోనే ఆ పార్టీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

తనకు కొత్త కమిటీల్లో చోటు కల్పించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెల్లయ్య‍ నాయక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి లేఖ రాశాడు. పార్టీలో ఎస్ టీలకు సరైన స్థానం కల్పించడంలేదని ఆయన ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News