వేణు స్వామి మహిళా కమీషన్ ముందు గైర్హాజరు ఎందుకంటే
వేణు స్వామి ఇవాళ మహిళా కమీషన్ ముందు హాజరు కాలేదు. కానీ కానీ వేణు స్వామి తరుపున మహిళా కమీషన్ ముందు 15 మంది న్యాయవాదులు హాజరు అయ్యారు
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇవాళ మహిళా కమీషన్ ముందు హాజరు కాలేదు. కానీ కానీ వేణు స్వామి తరుపున మహిళా కమీషన్ ముందు 15 మంది న్యాయవాదులు హాజరు అయ్యారు. అయితే సమాచారం ఇవ్వాలంటే ఒక్క లాయర్ సరిపోరా.. 15 మంది ఎందుకు అంటూ చర్చ జరుగుతుంది. హైకోర్టు ఆదేశాలు వేణు స్వామి ఖాతారు చేయడం లేదా.. ఇచ్చిన సమయానికి ఎందుకు వేణు స్వామి హాజరు అవ్వలేదు అని మహిళా కమీషన్ ప్రశ్నిస్తుంది. అయితే 15 మంది న్యాయవాదులు రావడంతో ఆశ్చర్యపోయారు మహిళ కమీషన్ సిబ్బంది. ఇది మొత్తం కమీషన్ సిబ్బందిని చుట్టు ముట్టిన 15 లాయర్లు.. సిబ్బందికి మర్యాద ఇవ్వకుండా వేలు చూపిస్తూ మాట్లాడారు. దాంతో ఆ లాయర్ల తీరు చూసి కమీషన్ ను ఆశ్రయించి అక్కడికి వచ్చిన ఇతరులు విస్తుపోయారు.
నాగ చైతన్య, శోభితల విడిపోతారని గతంలో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.గతంలో ఆగస్టు నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే వేణు స్వామి మహిళా కమీషన్ ముందు కాజరు కాలేదు. కోర్టును ఆశ్రయించిన ఆయన కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. అయితే తాజాగా వేణు స్వామి పిటీషన్ పై స్టే ఎత్తివేస్తూ కోర్టు వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మళ్ళీ మహిళా కమీషన్ రంగంలోకి దిగింది.