గాలికి పోయే పేలపిండి ఈటలకేనా..?

బీసీ సీఎం అనే ప్రకటనే పెద్ద మోసం అంటుంటే.. ఏకంగా హైదరాబాద్ లో బీసీ గర్జన మీటింగ్ పెట్టి ప్రధాని మోదీ మరింత హడావిడి చేశారు. అక్కడితో ఆగలేదు, మీటింగ్ తర్వాత 33 బీసీ, కుల సంఘాల ప్రతినిధులతో మోదీ భేటీ అయ్యారు.

Advertisement
Update:2023-11-08 09:10 IST

తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ నాయకుడిని సీఎం చేస్తామన్న బీజేపీ హైకమాండ్ మాటలు ఎంత కామెడీగా మారాయో అందరికీ తెలుసు. గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టుగా బీజేపీ స్టేట్ మెంట్ ఉందని మంత్రి కేటీఆర్ కూడా సెటైర్లు పేల్చారు. ఒక్క సర్వేలో కూడా బీజేపీ సీట్లు 10కి దాటలేదు. కొన్ని సర్వేలు మరీ 2-3 స్థానాలకే ఆ పార్టీని పరిమితం చేశాయి. అలాంటి బీజేపీ తెలంగాణలో బీసీ సీఎం అనే నినాదాన్ని తెరపైకి తేవడం ఆ వర్గాన్ని అవమానించడమే అంటున్నారు.

బీసీ సీఎం అనే ప్రకటనే పెద్ద మోసం అంటుంటే.. ఏకంగా హైదరాబాద్ లో బీసీ గర్జన మీటింగ్ పెట్టి ప్రధాని మోదీ మరింత హడావిడి చేశారు. అక్కడితో ఆగలేదు, మీటింగ్ తర్వాత 33 బీసీ, కుల సంఘాల ప్రతినిధులతో మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలోనే ఆసక్తకర చర్చ జరిగిందని సమాచారం. బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ పేరు దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెబున్నాయి. రాష్ట్రంలోని బీసీవర్గాలంతా కలసి బీజేపీని గెలిపిస్తే పరిపాలనా అనుభవమున్న ఈటలను ముఖ్యమంత్రి చేస్తామని మోదీ పేర్కొన్నారని అంటున్నాయి.

బీసీ సభలోనే అభ్యర్థి పేరు కూడా ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే తమ పార్టీలో అలాంటి ప్రకటనలేవీ ఉండవని బండి సంజయ్ వంటి వారు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మోదీ అనధికారికంగా ఈటల పేరు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ‘మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను, బీసీలను గెలిపించుకోండి. అందరికీ అందుబాటులో ఉండే ఈటల రాజేందరే మీ నాయకుడు’ అని ప్రధాని స్పష్టత ఇచ్చారంటున్నారు. ఓపెన్ టాప్ జీప్ లో వచ్చినప్పుడు, సభా వేదికపై కూడా ఈటలను మోదీ తన పక్కనే కూర్చోబెట్టుకున్నారని.. కూడా చెబుతున్నారు. ఈటలపై మోదీకి ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం అంటున్నారు. ఇది అధికారిక ప్రకటన కాకపోయినా బీజేపీలోని ఓ వర్గం ఈటల పేరుని హైలైట్ చేస్తోంది. దీనివల్ల బీజేపీకి వచ్చే లాభమేంటి..? ఎంత..? అనేది తేలాల్సి ఉంది. టోటల్ గా ఈ ఎపిసోడ్ లో ఈటలను బకరా చేశారని అంటున్నారు. విషయం తెలుసు కాబట్టి బండి సంజయ్ ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నారు. 

Tags:    
Advertisement

Similar News