ఏడో తేదీ నుంచి అక్కడే పడుకుంటా - బండ్ల గణేష్
పిల్ల దొరకలేదు కానీ, పెళ్లికి మహూర్తం పెట్టారంటూ రేవంత్ రెడ్డి 9వ తేదీ ప్రమాణ స్వీకారం గురించి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సెటైర్లు పేలుతున్నాయి. ఈ దశలో బండ్ల గణేష్ కూడా ప్రమాణ స్వీకారోత్సవం గురించి జోక్ పేల్చారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానంటూ ప్రగల్భాలు పలికి, చివరకు పిల్లిమొగ్గలేసిన సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్.. తాజా ఎన్నికలకు సంబంధించి కూడా అలాంటి పంచ్ డైలాగ్ ఒకటి వదిలారు. "ఏడో తేదీ నుంచి అక్కడే పడుకుంటా.." అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ బండ్ల గణేష్ ఎక్కడ పడుకుంటానన్నారు..? ఆ మాట ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది.
సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడి చేసిన బండ్ల గణేష్, మళ్లీ ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చారు. ముందు సోషల్ మీడియాలో స్టేట్ మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు, తర్వాత కాంగ్రెస్ కి బహిరంగంగా మద్దతు తెలిపారు, నేరుగా మీడియా ముందుకొచ్చారు, గాంధీ భవన్ కి వచ్చి హడావిడి చేస్తున్నారు. ఇటీవల ఆయన గాంధీ భవన్ కి వచ్చిన సందర్భంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో "ఏడో తేదీ నుంచి అక్కడే పడుకుంటా.." అనే డైలాగ్ కొట్టారు బండ్ల గణేష్. డిసెంబర్ 9వ తేదీన రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మీరు కూడా ఎల్బీ స్టేడియం వస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా బండ్ల బదులిచ్చారు. ‘నేను 7వ తేదీ నుంచి అక్కడే పడుకుంటా. మీరంతా 9వ తేదీన రండి’ అని సెటైర్ పేల్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పిల్ల దొరకలేదు కానీ, పెళ్లికి మహూర్తం పెట్టారంటూ రేవంత్ రెడ్డి 9వతేదీ ప్రమాణ స్వీకారం గురించి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సెటైర్లు పేలుతున్నాయి. ఈ దశలో బండ్ల గణేష్ కూడా ప్రమాణ స్వీకారోత్సవం గురించి జోక్ పేల్చారు. తాను ఏడో తేదీ నుంచి ఎల్బీ స్టేడియంలోనే పడుకుంటానన్నారు. అంటే ఆయన అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా బండ్ల ఇంతే కాన్ఫిడెంట్ గా బ్లేడుతో మెడ కోసుకుంటానన్నారని, అప్పుడు కాంగ్రెస్ ఓడిపోయిందని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అంటున్నారు. బండ్ల కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే, కాంగ్రెస్ ఓడిపోతుందని తేల్చి చెప్పారు.