బండి గుండెపోటు డ్రామా రిపీట్.. గంగుల సెటైర్లు
తుల ఉమకు వేములవాడ టికెట్ రాకుండా చేసి ఆ టికెట్ ని బండి సంజయ్ అమ్ముకున్నారని ఆరోపించారు మంత్రి గంగుల. కరీంనగర్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ నిధులపై చర్చకు సిద్ధమా అంటూ గంగుల తొడకొట్టి సవాల్ విసిరారు.
ఎంపీగా పోటీ చేసినప్పుడు గుండె నొప్పి అంటూ అబద్ధాలాడి బండి సంజయ్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని, ప్రజల్ని మోసం చేసి గెలిచారని ఎద్దేవా చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఈసారి కూడా ఆయన అలాంటి సింపతీ ఎపిసోడ్ రిపీట్ చేస్తాడని అన్నారు. మోదీ సభ రోజు ఏదో ఒక యాక్షన్ చేసి ఆస్పత్రిలో పడి గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నాడని కౌంటర్ ఇచ్చారు. ఓటమి ఖాయమని తెలిసే బండి నాటకాలాడుతున్నారని మండిపడ్డారు గంగుల.
కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. కేంద్రం నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందని బండి అంటున్నారు. ఎంపీగా గెలిచి ఒక్కరోజు కూడా నియోజకవర్గానికి బండి మొహం చూపించలేదని విమర్శిస్తున్నారు గంగుల. ఎన్నికలకు టైమ్ దగ్గరపడటంతో విమర్శల ఘాటు మరింత పెరిగింది. తుల ఉమకు వేములవాడ టికెట్ రాకుండా చేసి ఆ టికెట్ ని బండి సంజయ్ అమ్ముకున్నారని ఆరోపించారు మంత్రి గంగుల. కరీంనగర్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ నిధులపై చర్చకు సిద్ధమా అంటూ గంగుల తొడ కొట్టి సవాల్ విసిరారు
కరీంనగర్ లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, వ్యాపారస్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాగిస్తున్నారని చెప్పారు మంత్రి గంగుల. బండి సంజయ్ నోరు విప్పితే అబద్ధాలు చెబుతుంటారని, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రకటన వినోద్ కుమార్ వల్లే వచ్చిందని, అది ప్రకటించే సమయానికి బండి సంజయ్ ఎంపీ కాదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బండిపై మండిపడ్డారు గంగుల.
♦