గ్రూప్‌-1 అభ్యర్థుల మీద లాఠీచార్జిపై బండి సంజయ్‌ ఆగ్రహం

గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులు పలువురు కరీంనగర్‌లోని బండి సంజయ్‌‌ని కలిశారు.

Advertisement
Update:2024-10-18 18:34 IST

గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులు పలువురు కరీంనగర్‌లోని బండి సంజయ్‌ ఇంటికి వెళ్లి కలిశారు. మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయడంలో తమకు సాయం చేయాలని కేంద్రమంత్రిని కోరారు. ఈ సందర్భంగా గ్రూప్స్ అభ్యర్థుల నిరసనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు జీవో 29 గొడ్డలి పెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రూప్‌ – 1 అభ్యర్థుల విషయంలో రేవంత్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రూప్ -1 పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అశోక్‌ నగర్‌ నుంచి ఉద్యమం తెలంగాణ అంతా వ్యాపిస్తుందని హెచ్చరించారు. సమస్య తీవ్రం కాకముందే సర్కార్ దిగిరావాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అదేశాల మేరకు అశోక్‌ నగర్‌ వెళ్లి గ్రూప్‌-1 అభ్యర్థులను కలుసుకుంటానని చెప్పారు. అశోక్ న‌గ‌ర్‌లో మ‌ళ్లీ ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. గ్రూప్-1 ప‌రీక్ష‌ల‌ను రీ షెడ్యూల్ చేయాల‌ని ఆందోళ‌న‌కు దిగిన అభ్య‌ర్థుల‌పై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పోలీసుల దాడుల్లో ప‌లువురు అభ్య‌ర్థులకు తీవ్ర గాయాల‌య్యాయి. జీవో 29 ర‌ద్దు చేసేంత వ‌ర‌కు తమ పోరాటం ఆగ‌ద‌ని అభ్య‌ర్థులు తేల్చిచెప్పారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదాల‌తో అశోక్ న‌గ‌ర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు ద‌ద్ద‌రిల్లిపోతోంది.

Tags:    
Advertisement

Similar News