హైదరాబాద్లో దారుణం..మహిళపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్ మధురానగర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్ మధురానగర్లో దారుణం జరిగింది. ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం ఇళ్లలో పనిమనిషిగా చేసే ఓ మహిళ సోమవారం రాత్రి కొండాపూర్లో పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది.ఈ క్రమంలో ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు తమ రూమ్లో బట్టలు ఉతకాలని మయా మటలు చెప్పి తీసుకెళ్లారు. అనంతరం సదరు మహిళను రూమ్లో బంధించి పాశవికంగా లైంగికదాడికి పాల్పడ్డారు.
మహిళ అక్కడి నుంచి అతి కష్టం మీద తప్పించుకుని మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. నిందితులను యూపీ గోరఖ్పుర్నకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. రేవంత్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. తెలంగాణలో మహిళలకు రక్షణలేకుండా పోయింది. లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి. క్రైమ్ రేటు విపరీతంగా పెరిగింది