గ్రూప్స్ అభ్యర్థుల అరెస్టు అప్రజాస్వామికం

అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కేటీఆర్‌ డిమాండ్. గ్రూప్స్ అభ్యర్థులు కోరుతున్న మేరకు వెంటనే పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని ప్రభుత్వానికి సూచన

Advertisement
Update:2024-10-17 07:18 IST

సుదీర్ఘకాలంగా గ్రూప్స్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న పరీక్షల రీ షెడ్యూల్ అంశంలో మొండిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అశోక్ నగర్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులు, యువతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

ప్రజా పాలన అంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, ఉన్నత విద్యావంతులైన యువతి యువకుల నిరసన తెలియజేసే హక్కులను కూడా హరించి వేస్తున్న తీరుని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. గ్రూప్స్ అభ్యర్థులు అనేక అంశాల పైన తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టులో పలు కేసులు వేసి న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని, ఈ సమయంలో ప్రభుత్వం ఒక కేసులో వచ్చిన తీర్పును అడ్డుగా పెట్టుకుని మొండిగా ఈనెల 21వ తేదీన గ్రూప్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు. స్వయంగా విద్యార్థులే గ్రూప్స్ పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని కోరుతున్నప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు.

ఇదే అశోక్ నగర్ యువతీ యువకుల వద్దకు వచ్చి రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు ప్రాధేయపడి ఓట్లు వేయించుకొని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఆకాంక్షలను పక్కనపెట్టి నిరసన నిరంకుశంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇదే అశోక్ నగర్ వెళ్లి సుద్దులు చెప్పిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక వైఖరిని గమనించాలని కేటీఆర్ అన్నారు.

గ్రూప్ అభ్యర్థులు నిరసన తెలుపుతున్న ప్రతిసారి పోలీసుల చేత అరెస్టులు, దాడులు చేయిస్తున్న ప్రభుత్వ క్రూరమైన వ్యవహారాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుందని కేటీఆర్ అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్స్ అభ్యర్థులను, మహిళలని కూడా చూడకుండా అరెస్టు చేసిన యువతులను తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News