పవన్ కల్యాణ్ పర్యటనకు భారీ హంగామా.. రూట్ మ్యాప్ విడుదల

ఈనెల 24న హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు పవన్ కల్యాణ్. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి వాహనానికి కూడా పూజ చేస్తారు.

Advertisement
Update:2023-01-22 16:38 IST

పవన్ కల్యాణ్ పర్యటనకు భారీ హంగామా.. రూట్ మ్యాప్ విడుదల

పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనకు జనసేన భారీ హంగామా చేయబోతోంది. అందులోనూ వారాహి వాహనం తొలిసారిగా జనాల్లోకి వస్తుండటంతో దానిపై అందరికీ క్యూరియాసిటీ ఉంది. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పవన్ తన యాత్రను మొదలుపెట్టబోతున్నారు. ఈనెల 24న కొండగట్టుకు పవన్ కల్యాణ్ వెళ్తారు. ఆయన పర్యటనకు తాజాగా రూట్ మ్యాప్ విడుదల చేశారు.

ఈనెల 24న హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు పవన్. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి వాహనానికి కూడా పూజ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లిలో జనసేన ముఖ్యనేతలతో భేటీ అవుతారు. నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్ లో పార్టీ ముఖ్య నేతల సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో జనసేన పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్, నాయకులతో చర్చిస్తారని అంటున్నారు. ఆ తర్వాత ఆయన ధర్మపురి బయలుదేరి వెళ్తారు.

అనుష్టుమ్ నారసింహయాత్ర

ధర్మపురి నుంచి పవన్, అనుష్టుమ్ నారసింహ యాత్ర మొదలుపెడతారు. అనుష్టుమ్ నారసింహయాత్రలో భాగంగా ఆయన 32 నారసింహ క్షేత్రాలు దర్శించాల్సి ఉంటుంది. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి ఈ యాత్రకు శ్రీకారం చుడతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. తెలంగాణలోనే ఉంటున్నా.. చాలాకాలం గ్యాప్ తర్వాత పవనన్ తెలంగాణలో పర్యటన పెట్టుకోవడంతో అక్కడి జనసేన నేతలు కూడా ఆయన పర్యటనపై ఉత్సాహం చూపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News