పైగా ప్యాలెస్ కాదు.. అక్కడే సీఎం క్యాంప్ ఆఫీస్..!

సెక్యూరిటీ సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు ఉండవని చెప్పినప్పటికీ సీఎం పైగా ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు సీఎం నిరాకరించినట్లు సమాచారం.

Advertisement
Update:2024-01-13 17:41 IST
పైగా ప్యాలెస్ కాదు.. అక్కడే సీఎం క్యాంప్ ఆఫీస్..!
  • whatsapp icon

సీఎం రేవంత్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెర‌ప‌డింది. ప్రస్తుతం జూబ్లిహిల్స్‌లోని త‌న నివాసం నుంచే సీఎం రేవంత్ విధులు నిర్వహిస్తున్నారు. కాగా, సీఎం క్యాంపు కార్యాల‌యం కోసం ఇటీవల అధికారులు పైగా ప్యాలెస్‌ను సందర్శించారు. ఈ బిల్డింగ్‌ సమీపంలో ఎలాంటి రెసిడెన్స్ ఏరియా లేకపోవడంతో సామాన్యులకు ఇబ్బంది ఉండదని రిపోర్టు కూడా ఇచ్చారు. దీంతో అక్కడే సీఎం క్యాంప్ ఆఫీసు ఉంటుందని ప్రచారం జరిగింది.

అయితే పైగా ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి అయిష్టత చూపినట్లు సమాచారం. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్యాలెస్‌లోకి వెళ్లడం సరికాదని రేవంత్ భావించినట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు ఉండవని చెప్పినప్పటికీ సీఎం పైగా ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు సీఎం నిరాకరించినట్లు సమాచారం.

ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం తాత్కాలిక క్యాంప్‌ ఆఫీసు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్మాణం పూర్తి కాగానే రేవంత్ రెడ్డి అక్కడికి మారతారని అధికారులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News