అసెంబ్లీ సమావేశాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రి శ్రీధర్‌ బాబు

Advertisement
Update:2024-12-29 14:19 IST

మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ కు నివాళులర్పించడానికి సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న అసెంబ్లీ సమావేశాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, లెజిస్లేటివ్‌ అఫైర్స్‌ మినిస్టర్‌ దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఆదేశించారు. ఆదివారం అసెంబ్లీ హాల్‌ ను అధికారులతో కలిసి వారు పరిశీలించారు. సభకు హాజరయ్యే సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆ తర్వాత స్పీకర్‌ చాంబర్‌ నుంచి సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌, ఇతర ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అసెంబ్లీ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో లెజిస్లేటివ్‌ సెక్రటరీ నర్సింహాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




 


Tags:    
Advertisement

Similar News