చారిత్రక శిల్పాలపై రంగులు వెయ్యొద్దు.. - ఈమని శివనాగిరెడ్డి

మాల్ శివారులోనున్న గొడగండ్ల గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలోని సప్తమాతృకల శిలాఫలకం రెండు ముక్కలై, ఒకటి ప్రాకారం గోడకు బిగించి ఉండగా, మరొకటి మండప ద్వారానికి ఎడమవైపున బిగించి ఉన్నాయని, వాటిపై వేసిన నలుపు రంగు చరిత్రను చెరిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Update:2024-04-02 13:04 IST

ఎనిమిది శ‌తాబ్దాల నాటి కాకతీయుల శిల్పాలపై రంగుల వేసి ప్రాచీనతకు భంగం కలిగించవద్దని, రంగులు తొలగించి కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. మాల్ శివారులోనున్న గొడగండ్ల గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలోని సప్తమాతృకల శిలాఫలకం రెండు ముక్కలై, ఒకటి ప్రాకారం గోడకు బిగించి ఉండగా, మరొకటి మండప ద్వారానికి ఎడమవైపున బిగించి ఉన్నాయని, వాటిపై వేసిన నలుపు రంగు చరిత్రను చెరిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విగ్రహాలను పరిశీలించిన శివనాగిరెడ్డి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్, అంగిరేకుల గోపాల్, సభ్యులు ఇరుకుల రామ్మోహన్, కడారి జంగయ్య, గ్యారా ఉమా యాదయ్య, తుగిరి వెంకటయ్య, వంగూరు శ్యాంసుందర్, అర్చకులు వైద్యుల ప్రవీణ్ శర్మ, బాపతు సత్యనారాయణ రెడ్డిలకు శిల్పాల చారిత్రక ప్రాధాన్యతను వివరించి అవగాహన కల్పించారు.

Tags:    
Advertisement

Similar News