ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం
తుమ్మలకు నల్గొండ, కోమటిరెడ్డిని ఖమ్మం బాధ్యులుగా నియమించింది. ఇక రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా శ్రీధర్‌బాబు వ్యవహరించనున్నారు.
తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఇన్‌ఛార్జి బాధ్యతలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించింది. ఇక తుమ్మలకు నల్గొండ, కోమటిరెడ్డిని ఖమ్మం బాధ్యులుగా నియమించింది. ఇక రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా శ్రీధర్‌బాబు వ్యవహరించనున్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌ఛార్జి మంత్రులు వీరే-
కరీంనగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
మహబూబ్‌నగర్ - దామోదర రాజనర్సింహ
ఖమ్మం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
వరంగల్ - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి - శ్రీధర్‌బాబు
హైదరాబాద్ - పొన్నం ప్రభాకర్
మెదక్- కొండా సురేఖ
ఆదిలాబాద్ - సీతక్క
నల్గొండ - తుమ్మల నాగేశ్వర రావు
నిజామాబాద్ - జూపల్లి కృష్ణారావు