బీఆర్ఎస్‌కు మరో షాక్.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే!

బీజేపీలో చేరే అంశంపై ఇప్పటికే కార్యకర్తలతో ఆరూరి చర్చించినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో బీజేపీలో చేరికపై ఆయన క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.

Advertisement
Update:2024-03-03 16:53 IST

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పలువురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేయగా.. పలువురు మాజీ ఎమ్మెల్యేలు సైతం అదే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌.. బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఆరూరి రమేష్‌.. బీజేపీ నేతలతో చర్చలు జరిపినట్లు సమచారం. వరంగల్ ఎంపీ సీటు ఇచ్చేందుకు బీజేపీ సైతం అంగీకరించిందని తెలుస్తోంది. ఈ ఒప్పందంతో ఆయన కమలం గూటికి చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌ కూడా ఆరూరికే టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ.. మాజీ మంత్రి కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.

బీజేపీలో చేరే అంశంపై ఇప్పటికే కార్యకర్తలతో ఆరూరి చర్చించినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో బీజేపీలో చేరికపై ఆయన క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఎస్సీ నియోజకవర్గమైన వర్ధన్నపేట నుంచి 2014, 2018లో వరుసగా బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు ఆరూరి రమేష్‌. గెలిచిన రెండు సార్లు 85 వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కె.ఆర్.నాగరాజు చేతిలో ఓడిపోయారు.

Tags:    
Advertisement

Similar News