మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర
ఫార్ములా ఈ-రేస్ హైదరాబాద్‌లో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదములు అని తెలిపారు.
దేశంలోనే తొలి సారిగా ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ నెల 11న నగరంలోని హుస్సేన్‌సాగర్ తీరంలో ఈ రేస్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఈ రేస్‌కు సంబంధించిన టికెట్ల బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-రేస్ ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ఈ-రేస్‌ను నిర్వహించడం ద్వారా హైదరాబాద్ చరిత్ర సృష్టించనున్నది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్ర ఒక వీడియోను విడుదల చేశారు. ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ చాంపియన్‌షిప్ ఈవెంట్‌ను నిర్వహించనున్న తొలి భారతీయ నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించనున్నదని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిదేళ్ల రేసింగ్ తర్వాత ఇండియాకు ఈ రేస్ తరలి వచ్చిందని.. అందులో హైదరాబాద్‌లో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదములు అని తెలిపారు.
కాగా, టైటిల్ స్పాన్సర్ గ్రీన్‌కోను కూడా ఆనంద్ అభినందించారు. కాగా, ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. వెల్‌కమ్ ఆనంద్ జీ అంటూ రీ ట్వీట్ చేశారు. కాగా, ఎలక్రిక్ వాహన విభాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ తమలో విలీనమైందని మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే పేర్కొన్నది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి, తయారీ, విక్రయ కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికే విలీనం చేసినట్లు మహీంద్ర గ్రూప్ స్పష్టం చేసింది.