మా టైమ్ వచ్చేసింది -అమిత్ షా

బీసీ సీఎం అనే ప్రచారం బీజేపీకి ఎంత ఉపయోగమో తెలియదు కానీ.. ఈసారి మాత్రం దాన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా వినియోగించుకోవాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని గద్వాల్ సభలో మరోసారి నొక్కి వక్కాణించారు అమిత్ షా.

Advertisement
Update:2023-11-18 14:04 IST

తెలంగాణలో బీఆర్ఎస్ టైమ్ అయిపోయిందని, బీజేపీ టైమ్ వచ్చిందని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈరోజు బీజేపీ మేనిఫెస్టో విడుదల కోసం తెలంగాణకు వచ్చిన ఆయన.. ముందుగా గద్వాల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని చెప్పారు. హామీలను కేసీఆర్‌ నిలబెట్టుకోలేదని, గద్వాల పేదలకు 500 ఇళ్లు ఇస్తానని ఇవ్వలేదని ఆరోపించారు అమిత్ షా. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని అన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.


బీసీ సీఎం..

బీసీ సీఎం అనే ప్రచారం బీజేపీకి ఎంత ఉపయోగమో తెలియదు కానీ.. ఈసారి మాత్రం దాన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా వినియోగించుకోవాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని గద్వాల్ సభలో మరోసారి నొక్కి వక్కాణించారు అమిత్ షా. తెలంగాణలో బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటేయండి అని పిలుపునిచ్చారు. బీసీలకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అనుకున్న స్థాయిలో సీట్లు ఇవ్వలేదని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బీసీ వ్యతిరేక పార్టీలని చెప్పారు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. అమిత్ షా.

అమిత్ షా బిజీ బిజీ..

తెలంగాణలో అమిత్ షా రెండు రోజుల పర్యటన కాస్తా ఒకరోజుకి కుదించడంతో ఆయన బిజీబిజీగా గడపబోతున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి గద్వాల సభకు వచ్చిన అమిత్ షా, ఆ తర్వాత నల్లగొండ, వరంగల్ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుని బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. రాత్రికి ఆయన తిరుగు ప్రయాణంతో పర్యటన పూర్తవుతుంది.

Tags:    
Advertisement

Similar News