అన్నివర్గాల ప్రజల కోసం అంబేద్కర్‌ పనిచేశారు

సమాజ పరివర్తన, సమస్యలకు పరిష్కారం చూపేది రాజ్యాంగమే అన్న డిప్యూటీ సీఎం

Advertisement
Update:2024-12-06 12:54 IST

విద్య వల్ల ఇబ్బందులు అధిగమించవచ్చని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నమ్మారు. అనేక విశ్వవిద్యాలయాలను ఆయన స్థాపించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సమ సమాజ స్థాపనకు యువత మేధస్సు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని భట్టి తెలిపారు. రాజ్యాంగం ఒక్కటే సకల సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. అందుకే సంవిధాన్‌ సమ్మాన్‌ బచావ్‌ సమ్మేళన్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. సమాజ పరివర్తన, సమస్యలకు పరిష్కారం చూపేది రాజ్యాంగమే అన్నారు. మనంతరం రాజ్యాంగాన్ని చదవాల్సి అవసరం ఉందన్నారు. భారత్‌లో మానవ వనరులు అద్భుతంగా ఉన్నాయి. ప్రపంచాన్ని జయించే శక్తి, మేధస్సు భారత్‌లో ఉన్నది. జాతుల మధ్య పోరాటాలతోనే శక్తి మొత్తం నిర్వీర్యమౌతున్నదన్నారు. అసమానతలు లేకుండా ఉంటే భారత్‌ ప్రపంచాన్ని జయించి ఉండేదని భట్టి విక్రమార్క అన్నారు. అసమానతలు అధిగమించే అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. అణగారిన వర్గాల కోసమే అంబేద్కర్‌ పనిచేసినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ అది నిజం కాదన్నారు. దేశంలో అన్నివర్గాల ప్రజల కోసం అంబేద్కర్‌ పనిచేశారని తెలిపారు. ఆయన వల్లనే ప్రతి పౌరుడు సమానంగా ఓటు హక్కు పొందగలుగుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News